- Advertisement -
భారత రాజ్యంగ ప్రధాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పేరిట యేటా అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కత్తి పద్మారావు అంబేద్కర్ పేరిట శాశ్వతమైన అవార్డును నెలకొల్పితే బాగుంటుందని సూచించారని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.51కోట్లు డిపాజిట్ చేస్తున్నామని ప్రకటించారు. దీని కోసం రూ.51కోట్ల నిధి శాశ్వత నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సంవత్సరానికి రూ.3కోట్ల వడ్డీ వస్తుంది..దాంతో దేశం రాష్ట్రంలోని ఉన్న వరికి అంబేద్కర్ పేరిట ఉత్తమసేవలు అందించిన వారికి జయంతి రోజున అవార్డులు అందజేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి…
CMKCR:విగ్రహాం కాదు…నిలువెత్తు నిదర్శనం:కేసీఆర్
సీఎం కేసీఆర్ను కలిసిన ప్రకాశ్అంబేద్కర్..
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని .. అంబేద్కర్ ఆశయం నెరవేరలేదు
- Advertisement -