దేశానికి హైదరాబాద్‌ రెండో రాజధాని .. అంబేద్కర్ ఆశయం నెరవేరలేదు

30
- Advertisement -

అంబేద్కర్‌ జయంతి రోజున పాటలు పాడటం ఆడటం కాదు..నిజమైన నివాళి అంటే ఆయన సూచించిన సూచనలు ఆచరణలో పెట్టడమని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున అంబేద్కర్‌ 125అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్‌ భావాజాలం అవసరమన్నారు. సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదన్నారు. అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ మరో చరిత్రకు నాంది పలకాలని అన్నారు. రూపాయి సమస్యపై 1923లో అంబేద్కర్‌ పరిశోధనా పత్రం రాశారని, ఆంగ్లేయులు భారత్‌ను ఎలా దోచుకున్నారో గ్రహించారన్నారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.

దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని అంబేద్కర్‌ నమ్మారన్నారు. బలిదానాలు జరగకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి లేదన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రకాశ్‌ అంబేద్కర్‌ ప్రశంసించారు. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్‌ మద్దతిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన ప్రాణత్యాగం చేసే వరకు సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. దేశానికి రక్షణ సమస్య వస్తే రాజధాని అవసరమని అంబేద్కర్‌ చెప్పారన్నారు. రెండో రాజధాని హైదరాబాద్‌ సరైందని అంబేద్కర్‌ చెప్పారన్నారు. పాక్‌, చైనా నుంచి హైదరాబాద్‌ ఎంతో దూరంలో ఉంది. రెండో రాజధాని హైదరాబాద్‌ ఉండాలన్న ఆయన ఆశయం నెరలేదన్నారు.

ఇవి కూడా చదవండి…

జనసేనాని.. ” వారాహి ” దారేది ?

CMKCR:విగ్రహావిష్కరణ చేసిన సీఎం కేసీఆర్‌..

సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌అంబేద్కర్‌..

- Advertisement -