ఎన్టీఆర్ ‘వార్2’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ టాపిక్ పై రోజూ ఏదొక నెగిటివ్ వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. తాజాగా ముంబైలోని గెలాక్సీ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ మనోజ్ దేశాయ్ ఏం మాట్లాడాడు అంటే.. వార్ 2లో ఎన్టీఆర్ కి బదులుగా రామ్ చరణ్ నటిస్తే బాగుంటుంది అంటూ మనోజ్ దేశాయ్ చెప్పుకొచ్చాడు.
హృతిక్ రోషన్‌తో కలిసి రామ్ చరణ్.. వార్ 2 సినిమా చేస్తే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పాటు సౌత్‌లో హిందీ సినిమాలకు మార్కెట్ పెరుగుతుందని మనోజ్ దేశాయ్ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ హిందీ సినిమాలకు బాగా కలిసి వచ్చేది అని మనోజ్ దేశాయ్ తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే, ఈ కామెంట్స్ పై నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
పాపం మనోజ్ దేశాయ్ బాగా ముసలోడు కావడం వల్ల మైండ్ దొబ్బింది అని, అసలు ఈ ఆఫ్ బ్రైన్ గాడికి ఎవరు ఏమిటి ? అనేది తెలుసా ?, రామ్ చరణ్ సౌత్ లో స్టార్ హీరోనే. నో డౌట్. కానీ.. ఎన్టీఆర్ స్టార్ డమ్ గురించి ఇతనికి ఏం తెలుసు ?, నిజానికి చరణ్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా ఎన్టీఆర్ మంచి నటుడు. మంచి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో. వార్ 2 అనేది యాక్షన్ ఫిల్మ్.
మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ కి మించిన ఆప్షన్ దొరుకుతుందా ?, అయినా నిర్మాత ఆదిత్య చోప్రా ఏమైనా అమాయకుడా ?, వెరీ సక్సెస్ ఫుల్ నిర్మాత. వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ చుట్టూ 5 నెలలు తిరిగారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాతే.. ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండనుంది.
ఇవి కూడా చదవండి…