ప్చ్.. పాపం శాకుంతలం!

50
shakunthalam
- Advertisement -

గుణశేఖర్ డైరెక్షన్‌లో హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఈ రోజు విడుదలైంది. సినిమాకి నెగిటివ్ టాక్ వస్తోంది. ‘పాటలు, నేపథ్య సంగీతం బాగున్నా.. విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ వర్క్ ఆకట్టుకోలేదు అని టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే.. విడుదలైన తొలి రోజే ఈ సినిమాకి షాక్ తగిలింది. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వద్ద అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్‌ థియేటర్‌కు వెళ్లే దారులన్నీ రాత్రి గం.8ల వరకు మూసివేయడంతో ఈ రోజు గం.6 వరకు షోలన్నీ రద్దయ్యాయి. టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం తెలిపింది.

అయితే, ఐమాక్స్‌ థియేటర్‌ లో 8 స్క్రీన్స్ కి పైగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయి. పాపం శాకుంతలం కి మొదటి నుంచి కలిసి రావడం లేదు. సినిమాకి అనుకున్నంత బజ్ రాలేదు. అసలకే బజ్ లేదు. దీనికితోడు కథలో బలమైన సంఘర్షణ లేదు అని, దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు అని, తెలిసిన కథను రక్తికట్టించేలా దర్శకుడు తీయలేకపోయారు’ అంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఈ అభిప్రాయాల్లో మ్యాటర్ ఉండటంతో ఈ టాక్ బాగా బలంగా జనంలోకి వెళ్తుంది.

మరోవైపు ‘శాకుంతలం’ సినిమాపై అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ చేశారు. “శాకుంతలం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇంతమంచి సినిమాను అందించిన టీం మొతానికి విషెస్ తెలుపుతున్నాను. అల్లు అర్హను తెరపై పరిచయం చేయడమే కాకుండా.. ఆమెను చాలా అమూల్యంగా చూసుకున్నందుకు గుణగారికి ధన్యవాదాలు. ఈ మధుర క్షణం ఎప్పుడూ గుర్తుంటుంది” అని బన్నీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -