సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరిగే జీ-20 సదస్సుకు హాజరుకావాల్సిందిగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను ఆహ్వానించారు ప్రధాని మోడీ. ఈ మేరకు సునాక్‌కు ఫోన్ చేసిన మోడీ పలు అంశాలపై చర్చించారు. భారత్ వ్యతిరేక శక్తుల విషయంలో గట్టి చర్యలు చేపట్టాలని రిషి సునాక్‌ను కోరారు.
భారత్ హై కమిషన్‌పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. పరస్పర ప్రయోజనదాయకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా బ్రిటన్ లో నివాసముంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వ్రజాల వ్యాపారి నీరవ్ మోడీలను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విషయంపై కూడా ఇరువురి ప్రధానుల మధ్య చర్చకు వచ్చింది. ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్లో ఉంటున్నవారిని మన దేశానికి అప్పగించే విషయంలో పురోగతిని గురించి ప్రధాని మోదీని రిషి సునక్ ను అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..