ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

43
- Advertisement -

ఓ వైపు వేసవి సినిమాలు వరుసగా థియేటర్‌లో సందడి చేసేందుకు సన్నద్ధం అయ్యాయి. దీనికితోడు థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయినప్పటికీ, ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అలాగే థియేటర్స్ లో పలు చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవే
శాకుంతలం (తెలుగు సినిమా) – ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
రుద్రుడు (తమిళ చిత్రం – తెలుగు డబ్) – ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
విడుదల పార్ట్ 1 (తమిళ చిత్రం – తెలుగు డబ్) – ఏప్రిల్ 15న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఓటిటి లో ప్రసారాలు ఇవే :
అమెజాన్ ప్రైమ్ వీడియో: జూబ్లీ (హిందీ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: ఓ కాలా (తెలుగు సినిమా) – ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఆహా: దాస్ కా ధమ్కీ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జీ5: మిసెస్ అండర్ కవర్ (హిందీ చిత్రం) – ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ETV విన్: అసలు (తెలుగు సినిమా) – ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

Virupaksha Trailer: అదుర్స్

అనుపమ కొత్త అవతారం

PSPK:గుడ్‌న్యూస్ త్వరలో వకీల్‌సాబ్‌-2..!

- Advertisement -