వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త?

61
- Advertisement -

వేసవికాలం వచ్చిందంటే చాలామంది స్విమ్మింగ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా పల్లెల్లో అయితే పిల్లలు పెద్దలు కూడా వాగులు లేదా బావిల వద్దకు చేరి కేరింతలతో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. సిటీలలో అయితే పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్స్ వద్దకు చేరి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వేసవిలో అధికంగా స్విమ్మింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పల్లెల్లో అయితే బావిలలో నిలువ ఉన్న నీటిలో ఈత కొట్టడం వల్ల ఆ నీటిలో సూక్ష్మ జీవీలు, బ్యాక్టీరియా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నీటిలో స్విమ్మింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అలాంటి నీటిలో ఎక్కువ శాతం ఈత పడడం వల్ల చర్మం పొడి బారడం, దద్దుర్లు, దురద వంటి సమస్యలతో పాటు కళ్ళు తిరగడం, కళ్ల మంటలు వంటి సమస్యలు కూడా వచ్చే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ నీటిని ఈత పడేటప్పుడు మింగడం వల్ల అతిసార, విరోచనలు, ఇంకా మరెన్నో సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది. ఇక స్వీమింగ్ ఫూల్స్ కు వెళ్ళే వారి సంఖ్య కుడా అధికంగానే ఉంటుంది. వీరిలో వివిద రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కుడా వస్తుంటారు.

అప్పుడు అందరు కలిసి స్విమ్మింగ్ చేయడం వల్ల ఒకరి రోగాలు ఇంకొకరికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాంతో లేని సమస్యను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి పల్లెల్లో బావి దగ్గర ఈత పడే వారైనా లేదా సిటిల్లో స్విమ్మింగ్ ఫూల్స్ లో స్విమ్ చేసేవారైనా ఎంతో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. సమయాభావం లేకుండా భహిరంగ ప్రదేశాల్లో ఈతపడడం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి పారే నీటిలో గాని లేదా జనసాంద్రత తక్కువగా ఉన్న స్విమ్మింగ్ ఫూల్స్ లో మాత్రమే ఈత కొట్టడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -