బాహుబలి వర్సెస్ ఐపీఎల్

249
Bahubali 2 Vs IPL
- Advertisement -

బాహుబలి ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా బాహుబలి : ది కన్‌క్లూజన్. మరోవారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమాను చూసేందుకు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బహుబలి మేనియాను క్యాచ్ చేసుకునేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.మరి ఈ నేపద్యంలో బాహుబలి కి ఎటు చూసినా కష్టలు ఎదురౌతున్నాయి.మొన్నటి వరకు కట్టప్పతో కష్టాలు వచ్చిపడ్డాయి.మరి తాజాగా మరో సమస్య ఎదురైంది.

Bahubali 2 Vs IPL

ఈ మద్యనే ఐపీఎల్ సీజన్ మొదలై ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తేలిసిందే.అయితే క్రికెట్ అభిమానులు అటు ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తునే మరో వైపు బహుబలి కోసం ఎదురుచూస్తున్నారు..మరి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి-2’ చిత్రం ఈ నెల 28న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి అన్ని రకాల ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా… బాక్సాఫీస్ ను కొల్లగొట్టేందుకు రెడీ అయింది. మరి ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్-10 సీజన్ ఇప్పటికే ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులంతా ఐపీఎల్ లో మునిగి తేలుతున్నారు.

మరి గత మ్యాచ్ లతో పోల్చుకుంటే రాబోయే మ్యాచ్ మరింత కీలకం.ఈ మ్యాచ్ లకు టీఆర్పీ రేటింగ్ లు సైతం భారీగా ఉన్నాయి. ‘బాహుబలి-2’ సినిమా విడుదల సమయానికి కీలక మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్ ల ఎఫెక్ట్ బాహుబలి కలెక్షన్స్ పై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, మ్యాచ్ లు సాయంత్ర వేళల్లో జరగనుండటంతో… పగటి పూట షోలపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ ను బాహుబలి ఎంతవరకు ఎదుర్కోగలడో? అంతిమ విజేత ఎవరో? బాహుబలి విడుదల వరకువేచి చూడాలి.

- Advertisement -