టాలీవుడ్ చందమామ.. కాజల్ కెరియర్ ఇక చివరి దశకు చేరుకుందనే టాక్ వినిస్తోంది. చిరంజీవి మూవీ మినహా ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలేవి లేవు. అందుకే ఐటెమ్ సాంగ్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. రీసెంట్ గా జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ తో ఆడిపాడింది ఈ భామ. ప్రస్తుతం కాజల్ పరిస్థితి చూస్తుంటే.. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయంటున్నారు సినీజనాలు. కాజల్ కూడా తరుచూ పెళ్లిపై మాట్లాడడం చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది.
కాజల్ చెల్లెలు నిషాకు పెళ్లై చాలా రోజులు అవుతోంది. దీంతో బంధువులంతా పెళ్లెప్పుడని కాజల్ ని విసిగిస్తున్నారట. అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కాజల్ మనసు పెళ్లిపైకి మల్లుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేసే ఉద్దేశం కూడా కాజల్ కి లేదట. ఫ్యామిలీ కావాలా? సినిమా కావాలా అంటే.. తన ఓటు కుటుంబానికే అని కాజల్ అంటోంది. ఎప్పడు బిజినెస్ మైండ్ తో ఆలోచించే.. కాజల్ కెరియర్ ముగింపు విషయంలోనే అదే ఆలోచనతో ఉందట. అందుకే పెళ్లి సమయం వచ్చేలోపు వీలైనన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెబుతోంది కాజల్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో కదూ..
Courtesy: Yo Yo TV