భద్రాద్రి రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే రాములవారి కల్యాణానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, దూరప్రాంతాల నుండి వచ్చే వారికి ఎలాంటి లోటు లేకుండా చూసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంగణాలు విద్యుద్దీకరణతో సుందరంగ ముస్తాబు చేశారు.
ఈ నెల 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళి సై హాజరుకానున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..