సమాన పనికి సమానమైన వేతనం ఎవరైనా కొరుకుంటారు. కానీ సినిమా రంగంలో అది మరింత తక్కువగా ఉంటుంది. హీరోకి ఒక రేటు హీరోయిన్‌కు ఒక రేటు ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఒక రేటు దానికి తోడు వివిధ విభాగాల్ల పనిచేసేవారికి కూడా వేరు వేరు రేటు కలిగి ఉంటారు. కానీ సినిమా రంగంలో కూడా సమానమైన పనికి లేదా శ్రమను ఆధారం చేసుకోని రెమ్యునరేషన్ ఇవ్వాలని హీరోయిన్ సమంత డిమాండ్ చేశారు.
శాకుంతలం సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్…నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరుడుతున్నాను. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని నేను పోరాడుతున్నట్టు కాదని కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుందని అన్నారు. నాశ్రమ చూసి మేము మీకు ఇంత పారితోషికం ఇవ్వాలనుకుంటున్నాం. అని సినిమాకు చెందిన వాళ్లే చెప్పాలి కానీ నాకు ఇంత ఇవ్వండని యాచించాల్సిన అవసరం లేదన్నారు. మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నేను నమ్ముతాను. ఎప్పటికప్పుడు మన సామర్థ్యాలను పెంచుకుంటూ పోవాలి అని చెప్పుకొచ్చింది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ ఫస్ట్ లుక్లతో చిత్రబృందం సినిమాపై క్యూరియాసిటీ రెట్టింపు అయ్యేలా చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వరస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది మన సామ్.
ఇవి కూడా చదవండి…