బ్లాక్ మనీ:రివ్యూ

226
review-black-money
review-black-money
- Advertisement -

టాలీవుడ్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రాలు, తెలుగులోకి డబ్బింగ్ అయిన ఆయన సినిమాలు ఘనవిజయాన్ని సాధించాయి. జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తెలుగులో ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకొన్న మోహన్‌లాల్ మరోసారి బ్లాక్ మనీ సినిమాతో ముందుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :
వేణు (మోహన్ లాల్) జర్నలిస్ట్. వేణుకు రాజకీయాలన్నా,రాజకీయ నాయకులన్నా పడదు. వేణుని ఒక కేసుకు సంబంధిచిన ఆధారాలు సేకరించాల్సిందిక పై ఉద్యోగులు ఆర్డర్ వేస్తారు. వేణు మరొక జర్నలిస్ట్ రేణు (అమల పాల్) తో కలిసి ఈ కేసులో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆధారాలు సేకరిస్తాడు. అయితే ఆధారాలు చేతిలో పడ్డాక రేణు ఉన్నట్టుండి సేకరించిన ఆధారాలను వేరొక ఛానెల్ కు ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో ఒక మంత్రి వేణు, రేణుల వెంట పడతాడు. అలా చిక్కుల్లో పడ్డ వేణు వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు ? కేసులోని అసలు నేరస్థుల్ని ఎలా జైలుకు పంపాడు ? అసలు రేణు ఆధారాలు ఎందుకు మరొక ఛానల్‌కి ఇస్తుంది? అనేదే కథ.

ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్ జర్నలిస్ట్ పాత్రలో అద్భుతంగా నటించారు. సెకాండాఫ్ మొత్తాన్ని తన నటనతోనే ముందుకు తీసుకెళ్ళాలని ఆయన చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అమల పాల్ తన పాత్రలోని నెగెటివ్ షేడ్స్ ను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు ఫస్టాఫ్ చివరి 30 నిముషాల సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. అసలు మీడియా సర్కిల్ ఎలా పనిచేస్తుంది, ఒక ఛానెల్ టాప్ ప్లేస్ లో నిలవడానికి ఇతర చానల్స్ తో ఎలా పోటీపడుతుంది అనే వాటిని స్పష్టంగా, ఆసక్తికరంగా చూపారు. ఇక చివరగా సెకండాఫ్లో మోహన్ లాల్, అమల పాల్ ల మధ్య వచ్చే సంఘర్షణ పూరిత సన్నివేశాలు బాగున్నాయి.

unnamed

మైనస్ పాయింట్స్ :
మోహన్ లాల్, అమలా పాల్ ఇద్దరూ పోలీసుల నుండి తప్పించుకోవడం, దాక్కోవడం వంటి సీన్లు అసలు కథను పక్కదారి పట్టించాయి. దీంతో అప్పటి వరకు ఒక మూడ్లో ఉన్న సినిమా ఉన్నట్టుండి ఇంకొక మూడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంటర్వెల్ అయ్యాక, సెకండాఫ్ మొదటి 15 నిముషాల గడిచాక సినిమా కాస్త కష్టంగా మారింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా విసిగించింది. దానిలో వలన కథనం కూడా అసలు కథ నుండి పక్కకు వెళ్ళిపోయినట్టు అనిపించింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు తికమక పెట్టాయి. కథనం కూడా కొన్ని చోట్ల బాగానే ఉన్నా సెకండాఫ్లో మాత్రం అనవసరంగా దాన్ని సాగదీసి సినిమాను పక్కదారి పట్టించారు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు జోషి విషయానికొస్తే అతని పనితనం జస్ట్ ఓకే ఆనేలా ఉంది. అతను ఎంచుకున్న కథ బాగుంది. సినిమాలో చాలా భాగం మలయాళం నేటివిటీ కనిపించడం వలన తెలుగు ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సుంది. ముందుగానే చెప్పినట్టు సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉంది. పాత్రల తెలుగు డబ్బింగ్ బాగుంది. కెమెరా వర్క్ సహజంగా బాగుంది.ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

తీర్పు :
ఈ ‘బ్లాక్ మనీ’ చిత్రం టీవీ ఛానాళ్ళు మధ్య జరిగే పోటీ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా చూపారు. ఇన్వెస్టిగేటివ్ తరహా సినిమాలని ఇష్టపడుతూ, సీరియస్ కథనాన్ని తట్టుకోగలిగే ప్రేక్షకులకు ఈ సినిమా బాగుంటుంది. కథనం మొత్తం సీరియస్ గా నడిచేది కావడంతో కామెడీని కోరుకునే వారికి నిరుత్సాహం తప్పదు.

విడుదల తేదీ:21/04/2017
రేటింగ్: 2.75 /5
నటీనటులు :మోహన్ లాల్, అమల పాల్
సంగీతం:ర‌తీష్ వేఘ
నిర్మాత:నసయ్యద్ నిజాముద్దీన్
దర్శకుడు:జోషి

- Advertisement -