బాహుబలి 2 టికెట్ రేట్ల పెంపు..!

211
Ticket price hike for Baahubali 2 ?
- Advertisement -

దేశమంతా బాహుబలి 2 ఫివర్‌తో ఉగిపోతోంది. విడుదలకు ఇంకోవారం మాత్రమే మిగిలుండటంతో సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమానూ చూడనంతమంది ఈ చిత్రాన్ని చూస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో బాహుబలి 2 టికెట్ల కోసం డిమాండ్ కూడా ఊహించని స్ధాయిలో ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అన్ని అమ్ముడు పోయినట్లు సమాచారం.

సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం 1500 థియేటర్లు పడుతుంటాయి. కొన్ని సినిమాలకు ఈ లెక్క 2 వేలను కూడా చేరింది. కానీ బాహుబలి ఏకంగా 2600 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.  బాహుబలి క్రేజ్‌ని క్యాచ్ చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 90 శాతానికి పైగా   థియేటర్లో ఈ చిత్రాన్ని ఆడించేందుకు ఎగ్జిబిటర్లు.. బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారికంగానే బాహుబలి-2 టికెట్ల రేట్లను పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారట బాహుబలి నిర్మాతలు.

దీంతో తొలి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారట ప్రొడ్యూసర్లు. ఈ రెండు ప్రతిపాదనలూ ఓకే అయితే.. బాహుబలి టీం పంట పండినట్లే. కలెక్షన్ల మోత మోగిపోవడం.. ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని ఫిగర్స్ నమోదవడం గ్యారెంటీ.

- Advertisement -