టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ హెచ్ఐవీ పరీక్షను చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు తాను మొదటి టాటూ ఎప్పుడు వేయించుకున్నారు. ఆ టాటూ వల్ల ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నాకు 15సంవత్సరాలు ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి మనాలి టూర్కు వేళ్లాను కుటుంబసభ్యులకు తెలియకుండా వీపుపై టాటూ వేయించుకున్న. ఇదే విషయాన్ని దాదాపుగా 4నెలల పాటు ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కానీ ఒకరోజు ఇంట్లో తెలిసి మా నాన్న వీపరీతంగా కొట్టారు. టాటూ వేయించుకున్న తర్వాత నేను చాలా భయపడ్డా. ఎందుకంటే ఆ సూదితో ఎంతమందికి టాటూలు వేశాడో నాకు తేలీదు. దాంతో నేను హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నెగిటివ్ వచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా 2024లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయాల్లోకి వస్తున్నారా అని ప్రశ్నించగా…ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని ఒకవేళ భవిష్యత్లో అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి…