- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్లో ప్రకటించారు. ఎన్నిక వివరాలను ప్రకటించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంట్ సభ్యులు, మండలి సభ్యులు ఒక్కో సెట్ చొప్పున, శాసన సభ్యులు నాలుగు సెట్లు, జడ్పీ చైర్ పర్సన్, కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక్కో సెట్ చొప్పున కేసీఆర్ పేరిట నామినేషన్లు వేశారని అన్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని వెల్లడించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్తకర్తలు స్వీట్లు పంచుకున్నారు.
- Advertisement -