బీఆర్ఎస్‌కు సరికొత్త నిర్వచనం తెలిపారు మంత్రి కేటీఆర్. BRS అంటే భారత రైతు సమితి అని తెలిపారు కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క తెలంగాణలోనే అన్నదాతకు పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
అందుకే ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు.. తమకు అదే పదివేలు అని రైతుల మనోగమతమని తెలిపారు. వేరేటోళ్లను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని చెప్పారు.
అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
BRS అంటేనే..
భారత " రైతు " సమితిఒక్క
తెలంగాణలోనే
మన అన్నదాతకు…
పెట్టుబడికి రూ.పదివేలు
పంట నష్టపోతే రూ.పదివేలుఅందుకే
మన రైతన్న మనోగతం
" ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు…
మాకు అదే పదివేలు… "వేరేటోళ్ళను
పొరపాటున నమ్మినా…
తెలంగాణ మళ్ళీ వెనక్కి.. వందేళ్లు pic.twitter.com/FyjjGIaIug— KTR (@KTRBRS) March 24, 2023