తెలంగాణలో ఆరోగ్య మహిళే లక్ష్యం: హరీశ్‌

39
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఆరోగ్య మహిళ కోసం రెండు మంగళవారాల్లో కలిపి 11121 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 8వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు క‌రీంన‌గ‌ర్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్ర‌తి మంగ‌ళ‌వారం ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల‌కే 8 రకాల వైద్య సేవ‌లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి మంగళవారం రోజున 4793మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా ఇందులో 975మందికి అవసరమైన మందులు ఉచితం పంపిణీ చేసినట్టు తెలిపారు. ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తుండటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 21 మంగళవారం రోజున 6328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్ ను సందర్శించారు. వీరిలో 3753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3783 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 718 మందికి మూత్రకోష ఇన్ఫెక్షన్ల నిర్ధారణ పరీక్షలు, 1029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్ పరీక్షలు, 477 మందికి విటమిన్ – డి లోప పరీక్షలు, 1294 మందికి సీబీపీ పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేని కొందరు, వ్యాధి లక్షణాల పై అవగాహన లేని మరికొందరు, వ్యయ ప్రయాసలకు ఓర్చే పరిస్థితి లేక మరికొందరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ రకాల పరీక్షలు…

  • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
  • ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
  • థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
  • మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
  • మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.
  • నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు
  • చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
  • సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
  • బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ అనే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ప్రత్యేకించి మహిళల కోసం 100అరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఇవి కూడా చదవండి…

మీరేమంటారు..ప్రజలకు కేటీఆర్ ప్రశ్న?

భద్రాచలం…రాములోరి పెళ్లికి సీఎం

కరీంనగర్‌..ఏరియల్ వ్యూ చేయనున్న సీఎం

- Advertisement -