భవన నిర్మాణ అనుమతులు.. మరింత సరళం

209
ministers meeting on incentives to the industry
ministers meeting on incentives to the industry
- Advertisement -

రాష్ర్టంలోని పెట్టుబడులకు ఇచ్చే ప్రొత్సాహకాలపై ఎర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశం అయినది. పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఈ సమావేశానికి హజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన చర్చించారు. టియస్ ఐపాస్ అమలు, పరిశ్రమలకు ప్రొత్సాహాకాలు ప్రకటించడం వంటి అంశాలపైన పలు నిర్ణయాలను ఈ ఉపసంఘం తీసుకున్నది. 200 కోట్ల పెట్టుబడి లేదా 1000 ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టుగా ఇప్పటిదాకా ఉన్న నిర్వచనంలో భూమి విలువను సైతం కలిపేందుకు ఈ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అయితే మెగా ప్రాజెక్టులకు ఇచ్చే ప్రొత్సాహాకాలు, కంపెనీల ఉత్పత్తి అధారంగా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.

జియస్టీ అమలు నేపథ్యంలో టి ఐడియా(T-IDEA) ద్వారా ఇచ్చే పన్ను రాయితీలను పునర్వించించేందుకు నిపుణుల కమీటీ ఎర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయితీరాజ్ సంస్ధలకు చట్టప్రకారం ఫీజులను చెల్లించి, అనుమతులు పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై పంచాయితీరాజ్ కమీషనర్ శాఖపరమైన అదేశాలివ్వాలని కోరింది. నాల కన్వర్షన్ విధానంలోనూ మరింత ఈజ్ డూయింగ్ బిజినెస్ పెంచేందుకు మరొక నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ మేరకు కన్వర్షన్ ఫీజులను టియస్ ఐపాస్ దరఖాస్తు సమయంలోనే ఫీజు చెల్లించిన పిదప 7 పని దినాలు దాటిన తర్వతా డీమ్డ్ అప్రూవల్ పద్దతిన అనుమతులిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. సోలార్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ర్టంలోకి వచ్చిన నేపథ్యంలో సోలార్ రంగంలోని పెట్టుబడిదారుల ఇబ్బందులపైన చర్చించారు. సోలార్ పెట్టుబడులను రినెవబుల్ ఎనర్జీ పెట్టుబడులను సైతం టి ఐడియా పథకం కిందకు తీసుకుని వచ్చి, టి ఐడియా ప్రొత్సాకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతి కూమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమీషనర్ పరిశ్రమలు నదీమ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -