రామ్ చరణ్ కు స్పొర్ట్స్ అంతా ఇష్టమా ?

42
- Advertisement -

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ” ఆర్ ఆర్ ఆర్ ” తరువాత రామ్ చరణ్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దాంతో రామ్ చరణ్ నుంచి తరువాత రాబోయే సినిమాలకోసం దేశ వ్యాప్తంగా వెయిటింగ్ నడుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ” RC15 ” చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ తరువాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ” RC17 ” చేయనున్నాడు. ఈ సినిమా గురించి చరణ్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ఎమోషనల్ డ్రామా అని, ఈ కథ యూనివర్సల్ సబ్జెక్ట్ అని చరణ్ చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కూడా రామ్ చరణ్ స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. .

గతంలో మెరుపు అనే చిత్రం కూడా క్రీడా నేపథ్యం ఉన్న కథాంశమే. కానీ అనివార్య్హ కారణాల వల్ల ఆ మూవీ పట్టకెళ్లలేదు. ఇక సమయం వచ్చినప్పుడు ప్రతిసారి తనకు స్పొర్ట్స్ పై ఉండే మక్కువను బయటపెడుతూ వచ్చారు. ఇక తాజాగా టీమిండియా సంచలనం విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించేందుకు తాను సిద్దమే అని చెప్పడంతో స్పొర్ట్స్ పై చరణ్ కు ఉండే ఇష్టం మరోసారి బయటపడింది. ఒకవేళ విరాట్ కోహ్లీ బయోపిక్ రామ్ చరణ్ చేస్తే వరల్డ్ వైడ్ సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో క్రీడాభిమానులు ఉన్నారు. ఇక రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబెల్ స్టార్ గా ఎదుగుతున్నారు. దాంతో నిజంగానే ఇది జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. కోహ్లీ పాత్రలో రామ్ చరణ్ కరెక్ట్ గా సెట్ అయ్యే అవకాశం ఉంది. మరి విరాట్ కోహ్లీ బయోపిక్ ను చరణ్ వద్దకు ఏ దర్శకుడు తీసుకెళ్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

వాయిదా పడనున్న ప్రభాస్ సినిమా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా !

రావణాసురలో సర్‌ప్రైజింగ్ పాత్ర చేశా:దక్షా

- Advertisement -