దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి అవసరమయ్యే ప్రతి వస్తువుపై ధరల భారం మోపింది మోడీ సర్కార్. సరే ధరలు పెంచితే పెంచారు గాని దేశమైనా ఆర్థిక వృద్ది సాధిస్తోందా అంటే అది లేదు. 2014 లో 42 రూపాయలు ఉన్న డాలర్ విలువ.. ఇప్పుడు 80 రూపాయలు దాటుతోంది. దీన్ని బట్టి మన రూపాయి విలువ ఏ స్థాయిలో పతనం అవుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి నిత్యవసర ధరలు ఎందుకు పెంచుతున్నట్టు అనే ప్రశ్న రాక మానదు. కరోనా తరువాత ఇతర దేశాలన్నీ కూడా వేగంగా పుంజుకుంటే.. మనదేశం మాత్రం ఆర్థికంగా నిలబడడానికి ఇంకా తడబడుతూనే ఉంది..
మరి అటు ఆర్థికంగా అభివృద్ది సాధించక.. ఇటు ప్రజలపై ధరల భారాన్ని తగ్గించక.. మరి మోడీ సర్కార్ ఎందులో పురోగతి సాధిస్తున్నట్లు అని ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉంచితే మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు చూపించడంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటిఆర్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన మోడీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. 2014 మే లో క్రూడ్ బ్యారెల్ 107 డాలర్లు ఉంటే లీటర్ పెట్రోల్ 71 రూపాయలు ఉండేది.. అదే క్రూడ్ బ్యారెల్ విలువ 2023 మార్చి నాటికి 65 డాలర్లకు పడిపోగా.. లీటర్ పెట్రోల్ ధర మాత్రం 110 రూపాయలకు చేరింది.. ఎలా ? అంటూ ప్రశ్నించారు మంత్రి కేటిఆర్.
సాధారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు ఇందన ధరలు పెంచాల్సి వస్తే.. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు ఇందన ధరలు కూడా తగ్గించాలి కదా ? మరి అలా కాకుండా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఇందన ధరలు ఎందుకు పెంచాల్సి వస్తోందని కేటిఆర్ మోడీ సర్కార్ పై సూటి ప్రశ్నలు సంధించారు. ఈ విధంగా కేటిఆర్ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తూ.. మోడీ సర్కార్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. మోడీ పాలనలో ఆధాని, అంబానీ లకు తప్పా సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మోడీ పాలనకు దేశ ప్రజలు చరమగీతం పాడడం ఖాయమని ట్విట్లు చేస్తున్నారు.
Straight question to PM @narendramodi Ji on skyrocketing #FuelPrices
May 2014 :
⛽️Crude per barrel was $107
Petrol – ₹71 per litreMarch 2023:
⛽️ Crude oil per barrel is $65
Petrol – ₹110 per litre👉If Fuel prices had to be hiked when price of Crude oil went up,… https://t.co/OLuEGsrN2Q pic.twitter.com/HjGxB8potA
— KTR (@KTRBRS) March 20, 2023
ఇవి కూడా చదవండి…