దక్షిణ అమెరికాలో భారీ భూకంపం..

12
- Advertisement -

దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7 గా నమోదుకాగా భూకంప కేంద్రం గుయాస్‌కు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం ధాటికి 14 మంది మరణించగా పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయని, పలు ఇళ్లు, విద్యాలయ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు క్యూన్కా నగరంలో కారుపై గోడకూలి ఒక వ్యక్తి మరణించగా, జంబెలీ ద్వీపంలో టవర్ కూలి ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. ఈక్వెడార్ లో 13 మంది, పెరూలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -