ప్రభాస్ తో  సంథింగ్.. నథింగ్ అట 

44
- Advertisement -
మా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. నేను వెంటనే వాటిని  ఖండించాను. అయినా ఎందుకు ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతున్నారు ?, అసలు మా మధ్య ఏముంది ? ఏమీ లేదు. అయినా,  ప్రభాస్, నేను కలిసి కనిపిస్తే, కలిసి నటిస్తే లవర్స్ అయిపోతామా ?, అసలు మీడియా అలా వార్తలు రాయొచ్చా ? అంటూ హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతోంది. ప్రభాస్ తో కృతి సనన్ ప్రేమలో ఉంది అంటూ ఇప్పటికే ఎన్నో రకాలుగా పుకార్లు వినిపించాయి.     

ఈ క్రమంలోనే కృతి సనన్ పై విధంగా మాట్లాడింది. ఐతే, ఇలాంటి మాటలు అన్నీ రొటీన్ అయిపోయాయి. జనం మారిపోయారు. అయినా  కృతి సనన్  అలాగే మాట్లాడుతోంది. ప్రభాస్ తో కృతి సనన్ డేటింగ్ లో ఉందని మీడియా వార్తలు రాస్తుంది అంటే..? దానికి కారణం ఎవరై ఉంటారు. కచ్చితంగా కృతి సననే కదా. ఆ మధ్య టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో  ప్రభాస్ తో కృతి సనన్ ఎంత క్లోజ్ గా ఉందో తెలిసిందే కదా. సరే క్లోజ్ గా ఉంటే లవర్ అయిపోతుందా ?,  కచ్చితంగా కాదు. కానీ, ఒక లవర్ లా  ప్రవర్తిస్తే ఏమనుకోవాలి ?   
 
మీడియా ఏదో వార్తలు రాస్తోంది అని కృతి సనన్  కస్సుబుస్సులాడుతోంది గానీ,  ఈ వార్తలు ఆమెకు కూడా ఇష్టమే అంటున్నారు.  కానీ, మరోవైపు ప్రభాస్ మాత్రం ఇదంతా ఉత్తిదే అంటున్నాడు. బాలకృష్ణ టాక్ షోకి వెళ్ళినప్పుడు ప్రభాస్ కి కృతితో మేటర్ ఏంటనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు కూడా ప్రభాస్ చాలా క్లారిటీగా ఏమీలేదు అని తేల్చి చెప్పాడు.   
ఇవి కూడా చదవండి..
- Advertisement -