తెలంగాణలోని టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్‌కు ఆదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగనుంది. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని సమాచారం అందడంతో బేగంబజార్ పోలీసులు కేసును నమోదు చేశారు.
అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి నిందితులపై 09,420,120(బీ)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో టీఎస్‌పీఎస్సీ మార్చి 12న జరగాల్సిన టీపీబీవో 15,16తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షలను రద్దు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధం ఉన్న 9మందిని ఆరెస్టు చేసినట్టు తెలిపారు. ఏఈ పేపర్ లీక్ కేసులో టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్‌డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిని రిమాండ్‌కు తరలించారు. ఏ3 రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మిగతా 8 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి…