పుష్ప 2లో లేను.. మీటూ పై స్పందన ఇదే

42
- Advertisement -

లేడీ ప‌వ‌ర్‌స్టార్ సాయి ప‌ల్లవి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2 షూటింగ్లో సాయి ప‌ల్లవి జాయిన్ కానుంద‌ని, ఈ సినిమాలో ఆమె కీ రోల్ చేస్తోంద‌ని వార్తలు ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్కర్లు కొడుతున్నాయి. బ‌న్నీ హీరోగా సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సాయి ప‌ల్లవి న‌టించ‌డంపై వ‌స్తున్న వార్తల‌న్నీ అవాస్తవాలేనని సాయి పల్లవి పీఆర్ వ‌ర్గాలు స్పష్టం చేశాయి. మొత్తానికి బన్నీ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటించడం లేదు.

అలాగే, సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సింగర్ స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘నిజం’లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఉద్యమంపై నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘చేతలతోనే కాదు మాటలతో ఎదుటివ్యక్తికి ఇబ్బంది కలిగించేలా చేసినా అది వేధింపులతో సమానమే’ అంటూ పేర్కొంది. సాయిపల్లవి పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది.

ఈ ఎపిసోడ్ లో సాయి పల్లవి తన కెరీర్‌ కి సంబంధించిన అనేక విషయాలతో పాటు తన సినీ జీవితంలో తనకు తగిలిన ఎదురుదెబ్బలతో సహా ఎన్నో విషయాలను సాయి పల్లవి ప్రేక్షకులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ‘మీటూ’పై కూడా సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి…

చరణ్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్

మహేష్ , త్రివిక్రమ్ ఇంత స్పీడా?

ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా మళ్ళీ వస్తుంది

- Advertisement -