అఖిల్ హీరోగా లాంచయి ఏడేళ్ళు గడుస్తుంది. ఈ ఏడాదితో ఎనిమిదేళ్ళ కెరీర్ పూర్తి చేసుకుంటాడు. అయితే అక్కినేని యంగ్ హీరోకి ఇంత వరకూ ఓ సాలిడ్ హిట్ పడలేదు. మూడు సినిమాల వరకూ రీ రీ లాంచ్ లు జరుగుతూనే వచ్చాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యావరేజ్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కినేని అఖిల ఆశాలన్నీ ఏజెంట్ మీదే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో అఖిల్ బ్లాక్ బస్టర్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క స్ మినహా టాకీ పూర్తి చేసుకుంది. ఇప్పటికే టీజర్ , సాంగ్ తో ప్రమోషన్ మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీగా సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే యాబై కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం కోట్లు పెట్టారు.
అఖిల్ కే కాదు, సురేందర్ రెడ్డికి కూడా ఓ సాలిడ్ హిట్ పడాలి. రేసు గుర్రం తర్వాత సురేందర్ రెడ్డి బ్లాక్ బస్టర్ కొట్టలేదు. సైరా నరసింహా రెడ్డి బాగానే వసూళ్లు చేసింది కానీ బ్లాక్ బస్టర్ కి కాస్త దూరంలో ఉండిపోయింది. సో ఇటు అఖిల్ కి అటు సూరి ఇద్దరికీ ఏజెంట్ బ్లాక్ బస్టర్ ఎంతో ముఖ్యం. చూడాలి అఖిల్ ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో !
ఇవి కూడా చదవండి..