ప్రభాస్ సెట్ లో అమితాబ్ కి గాయాలు

23
- Advertisement -

‘ప్రాజెక్ట్ కె’ సెట్‌లో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా, బిగ్ బీ కుడి పక్కటెముకలో కండరాలకు తీవ్ర గాయమైందని సమాచారం. వెంటనే షూట్ ఆపేసి హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘ప్రాజెక్ట్ కె’ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ప్రభాస్ కథానాయకుడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శ కత్వం చేస్తుండగా, వైజయంతి మూవీస్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #శర్వా 35..

మహేష్ తో హాలీవుడ్ లో కూడా !

KGF2 పై యంగ్ డైరెక్టర్ కామెంట్స్

- Advertisement -