1983లో వచ్చిన క్లాసికల్ ఎవర్‌గ్రీన్ మూవీ సాగర సంగమం. కళాతపస్వి కే. విశ్వానాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలమైన సినిమాగా చెప్పవచ్చు. లోకనాయకుడు కమల్ హాసన్ జయప్రద ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా…ఆద్యంతం కళారంగం మీదనే ఈ సినిమాను తెరకెక్కించారు. నాట్యరంగంకు జీవంపోసే పాత్రలో కమల్‌హసన్ నటన అద్భుతం. అంతే అద్భతమైన పాత్ర చేసింది. ఎస్పీ శైలజ.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు అయిన శైలజ…ఈ సినిమాకు ప్రధానమైన పాత్ర చేసింది. కమల్‌హసన్ వారసురాలిగా శైలజ చేసిన నటనకు ఎంతో పేరొచ్చింది. అయితే తాజాగా చెప్పాలని వుంది అనే ప్రోగ్రామ్ సందర్భంగా ఈ నటి సాగరసంగమం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఈ సందర్బంగా హీరో కమల్‌హాసన్‌ని కాలుతో కొట్టే సన్నివేశం గురించి కూడా ప్రస్తావించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ…సాగరసంగమం సినిమాలో కమల్‌ని కాలుతో తన్నే సన్నివేశం ఉంది. దానికి నేను ఎంత ప్రయత్నించినా నా కాలు వెనక్కి వచ్చేసేది. అప్పుడు డైరెక్టర్ విశ్వనాథ్ ఇది కేవలం నటన మాత్రమేనని వివరించారు. ఆతర్వాత ఈ సీన్‌ను చేయగలిగనాని చెప్పారు.
ఇవి కూడా చదవండి…