అమెరికాకి బయల్దేరిన ఎన్టీఆర్

10
- Advertisement -

ఆస్కార్ అవార్డుల కోసం ఎన్టీఆర్ అమెరికా ప్రయాణమయ్యాడు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరారు తారక్ . అక్కడ ‘అకాడెమీ అవార్డుల’ వేడుకకు హాజరుకావడమే కాకుండా హాలీవుడ్ దర్శకులతో సమావేశమై మాట్లాడనున్నారు.

రాజమౌళి రూపొందించిన “RRR” లో తన పాత్రతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. రేపటి నుండి ఎన్టీఆర్ అక్కడ ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేయనున్నాడు. రామ్ చరణ్ , రాజమౌళి మిగతా అందరూ అక్కడే ఉన్నారు. మార్చ్ 12 ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో RRR టీం మొత్తం పాల్గొననుంది. ఈవెంట్ లో నాటు నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ ఉండనుందని సమాచారం.

మళ్ళీ మార్చి మూడవ వారంలో ఎన్టీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తాడు, వచ్చిన వెంటనే దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తాడు. ఈ ఏడాది లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి…

KGF2 పై యంగ్ డైరెక్టర్ కామెంట్స్

వెండితెరపై మరో నందమూరి హీరో

ఏప్రిల్ 7న ‘అహింస’

- Advertisement -