- Advertisement -
కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ ఖుష్బూ. కుర్రకారు హృదయాలను దోచేసిన ఈ అమ్మడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళనాడులో గుడికట్టారంటే ఖుష్బూ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని అయితే అప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని, పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని చెప్పింది. దాంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది.
లైంగిక వేధింపులపై ప్రస్తుతం కుష్బూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమిళ దర్శకుడు, నటుడు సి.సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు ఖుష్బూ.
ఇవి కూడా చదవండి..
- Advertisement -