శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందించిన చిత్రం `బిచ్చగాడు`. విన్నూతమైన కంటెంట్‌తో పాటు పబ్లిసిటీ కూడా తోడవడంతో `బిచ్చగాడు` సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. తెలుగులో 25 కోట్లకు పైగా వసూళ్ళను సాధించి ఇటీవల విడుదలైన చిత్రాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా బంపర్ హిట్ కొట్టిన చిత్రమిది.
`బిచ్చగాడు` వంటి బ్లాక్ బస్టర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత చదలవాడ పద్మావతి రీసెంట్గా మలయాళలో ఘన విజయం సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` హక్కులను ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్న `బిచ్చగాడు` నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగులో `పిల్లా రాక్షసి అనే పేరుతో విడుదల చేస్తున్నారు. `బిచ్చగాడు` చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన ఆ సినిమా సక్సెస్‌లో భాగమైన రచయిత భాషా శ్రీ మలయాళ చిత్రం `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందిస్తుండటం విశేషం.
ఓ ఫ్రాడ్‌స్టర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నదే సినిమా. దర్శకుడు మిథున్ మాన్యూల్ థామస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రియలిస్టిక్ పంథాలో ఆవిష్కరించారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో పాటు, మ్యాజిక్ ఆద్యంతం రక్తికట్టించేలా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. `ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా, సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది. సన్ని వాయ్నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.