రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్నాడు అక్కడ RRR కి సంబంధించి అవార్డులు అందుకుంటూ మరో వైపు మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నాడు. తాజాగా ఆక్కడ మీడియాతో మాట్లాడుతూ తన ఫేవరెట్ మూవీస్ గురించి చెప్పుకున్నాడు చరణ్. “ది నోట్ బుక్’ , ‘టెర్మినేటర్ 2 ‘,గ్రాడియేటర్ ‘, ‘ది ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్’ తన ఫేవరెట్ హాలీవుడ్ మూవీస్ అంటూ చెప్పుకున్నాడు చరణ్.
అలాగే తెలుగులో తనకి ‘దాన వీర సుర కర్ణ’ , ;బాహుబలి’, ‘రంగస్థలం’, అలాగే షేకర్ కపూర్ తీసిన మిస్టర్ ఇండియా సినిమాకి తనకి ఎంతో ఇష్టమని తెలిపాడు చరణ్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా చరణ్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగుతుంది. త్వరలోనే ఎన్టీఆర్ కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వనున్నాడు.
ఇప్పటికే అక్కడ క్రిటిక్ అవార్డ్స్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ టీం హాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. మార్చ్ 13 న ఆస్కార్ అవార్డ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఆస్కార్ లో RRR కి ఎంట్రీ లభించింది. అవార్డు కార్యక్రమంలో నాటు నాటు ప్రదర్శించబోతున్నారు. తెలుగు సినిమాకి దక్కిన ఓ అరుదైన గౌరవంగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి అవార్డు దక్కుతుందా లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి…