శ్రియా పనైపోలేదు.. మళ్లీ మొదలైంది

54
- Advertisement -

2001 నుంచీ సినిమాలు చేస్తోంది శ్రియా సరన్… అంటే 22 ఏళ్లు… ఇండియన్ సినిమాలో సగటు హీరోయిన్ ఆయుష్షుతో పోలిస్తే శ్రియా సరన్ సినీ ఆయష్షు చాలా ఎక్కువ… ఆ మధ్య ఇక శ్రియా సరన్ పనైపోయిందన్నారు అందరూ… పెళ్లి అయ్యి, తల్లి అయ్యిపోయింది. పైగా శ్రియా ముసలిదైపోయింది, వట్టిపోయిందని ఆమెను ట్రోల్ చేశారు. కొందరు అయితే తిట్టిపోశారు… గౌతమిపుత్ర శాతకర్ణితో మళ్లీ పట్టాలెక్కిన శ్రియా.. తాజాగా సోషల్ మీడియాలో అందాల మెరుపులు మెరిపిస్తోంది. పాత శ్రియా ను గుర్తుచేస్తోంది… శ్రియా పని అయిపోయిందని కూసిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి… పైగా ఇప్పుడు శ్రియా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

నలభయ్యేళ్ల వయస్సొచ్చినా సరే, పాతకలోపే అన్నట్టు కనిపిస్తున్న శ్రియా సరన్ చేతిలో ఉన్న కబ్జా సినిమా తాజా సంచలనం… అంత వయస్సొచ్చింది కదాని వెటరన్ హీరోయిన్ల పక్కన కనిపించడం లేదు… కబ్జా సినిమా హీరో ఉపేంద్ర.. అలాగే మరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటించాడు. సౌత్‌లో ఈ సినిమాకూ భారీ డిమాండ్ ఉంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. ఉపేంద్ర సినీ కెరీర్ లో ఎప్పుడూ లేనంత హైప్ క్రియేటైంది ఈ సినిమాకు… వస్తున్న వార్తల ప్రకారం… కబ్జా చిత్రం శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్, థియేటరికల్ రైట్స్ అన్నీ కలిపి 70 కోట్ల ప్రిరిలీజ్ రికవరీ… అంటే రిలీజుకు ముందే 70 కోట్లు చేతుల్లో పడ్డట్టు లెక్క…

మరి ఈ రేంజ్ లో శ్రియా సరన్ హీరోయిన్ గా వస్తున్న కబ్జా సినిమాకి బిజినెస్ జరగడంతో ఇప్పుడు ఆమె కెరీర్ కి మరింత ఊపు పెరిగింది. పైగా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కబ్జా ప్రసారానికి నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 40 కోట్లు ఇస్తోంది. ఇంతటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టుకు కూడా శ్రియా సరన్ ను తీసుకున్నారు నిర్మాతలు, దర్శకుడు. అదీ శ్రియా సరన్ తాజా డిమాండ్. ఇక ఈ సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సరే, మొత్తం వసూళ్లు దుమ్మురేపడం ఖాయం…అప్పుడు శ్రియా సరన్ కి పూర్వ వైభవం… కాదు, దాన్ని మించి దూసుకుపోతోంది ఏమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

సినీ నటి సమంతకు గాయాలు…

పవన్ సరసన శ్రీలీల.. నిజమేనా?

సంక్రాంతికి ‘RC15’ ఫిక్స్ !

- Advertisement -