గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట పరిధిలో 2వేల మంది విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…రాబోయే మూడు నెలలు బాగా కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొవాలన్నారు.
దేశంలో రాష్ట్రంలో సిరిసిల్ల బిడ్డలు అగ్రభాగాన ఉన్నారంటే మీ తల్లిదండ్రులు అధ్యాపకులు ప్రజాప్రతినిధులైనా మేమంతా గర్వపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్‌లు పంచారు. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. సమయంను వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తు చేశారు. ట్యాబ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లాంటి వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు. ఆకాష్ బైజూస్ సాఫ్ట్వేర్ సహాకారంతో ఈ ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. మీరు బాగా చదువుకుంటే..మేమంతా సంతోషపడుతామని అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డి పేట పాఠశాలను రూ.7కోట్ల వ్యయంతో అద్భుతంగా తయారువుతోందన్నారు. రాబోయే 2,3నెలల్లోనే ప్రారంభించుకుందామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌ను అభివృద్ది చేసుకుందామని… వేణుగోపాల స్వామి ఆలయాన్ని రూ.2కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గంభీరావుపేట కేజీ టూ పీజీ క్యాంపస్‌ను ప్రారంభించుకున్న సంగతిని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే సిరిసిల్లాలోని పాఠశాలలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. వీటిని కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన వసతలను ఏర్పాటు చేసుకుందామని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దతామని..వాటిలో ఇంగ్లీష్ బోధన అందిస్తామని తెలిపారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ఇవి కూడా చదవండి…