టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విజయం సాధించి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది ఆసీస్ మహిళల టీమ్. ఆసీస్ విధించిన 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 137 పరుగులు చేసింది. ఓపెనర్ లారా ఓల్వార్ట్ 61 పరుగులు చేయగా, క్లో ట్రయోన్ 25 పరుగులు చేసింది. మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో దక్షిణాఫ్రికా ఓటమి తప్పలేదు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 156 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీతో 53 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్ నిలవగా ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 పరుగులు చేశారు. బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా ఆసీస్ ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కైవసం చేసుకుంది. ఓవరాల్ గా ఆసీస్ మహిళల జట్టుకు ఇది 6వ టీ20 ప్రపంచకప్.
ఇవి కూడా చదవండి..