హాయిగా నిద్ర పోవడానికి..!

84
- Advertisement -

నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అంతే కాకుండా రోజంగా పని ఒత్తిడి కారణంగా కూడా రాత్రివేళల్లో నిద్రకు భంగం వాటిల్లుతుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి కనీసం 6 గంటల సుఖనిద్ర అవసరం. అందువల్ల నిద్ర సమయం ఏ మాత్రం తగ్గిన ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కళ్ళు ఎర్రబడడం, రోజంతా బద్దకంగా ఉండడం, శరీరం నీరసంగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు నిద్రలేమి కారణంగా మనలను చుట్టుముడతాయి. అయితే ఈ నిద్రలేమి సమస్య నుంచి బయట పడడానికి చాలమంది స్లిపింగ్ ట్యాబ్లెట్స్ వాడడం, లేదా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. వీటివల్ల ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. చక్కటి ఇంటి చిట్కాల ద్వారానే హాయిగా నిద్ర పోవఛ్బు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం !

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే ఇట్టే నిద్ర పట్టేస్తుంది. ఎందుకంటే పాలలోని ప్రోటీన్ మన శరీరాన్ని రిలాక్స్ మూడ్ లోకి తెస్తుంది. అలాగే తేనె లోని ట్రిఫ్టోపాన్ మన శరీరంలోని నిద్రకు సంబంధించిన హార్మోన్లను ప్రేరేపితం చేస్తుంది. అందువల్ల హాయిగా నిద్ర పోవచ్చు. ఇక గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని కలిపి తాగిన ఇట్టే నిద్ర పట్టేస్తుంది. అరటిపండ్లు కూడా నిద్ర పట్టేలా చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. అరటిలో మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటివల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు నిద్రలేమి సమాస్య కూడా దూరం అవుతుంది. ఇకా రాత్రి పూట ఫ్యాట్ లెస్ పెరుగు తినడం వల్ల కూడా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పూట మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే.. హాయిగా నిద్ర పోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR:నీట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రపండి..

- Advertisement -