వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో బై లాంగ్వేజువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నేటితో ముగిసింది. ఈ మేరకు నిన్నటి తో (ఫిబ్రవరి 24) నాగచైతన్యని కస్డడీ నుంచి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు సినిమాను మే12న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ‘కస్టడీ’ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇందులో చైతు ఓ కానిస్టేబుల్ గా కనపడనున్నారు.
ఈ సినిమా కోసం దాదాపు 13 సెట్లు వేశారు. పైగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు. ఇప్పటికే సినిమాకి అనుకున్న దాని కంటే.. బడ్జెట్ డబుల్ అయ్యింది. అయితే ఈ సినిమాకని భారీగా ఖర్చు చిత్రీకరిస్తుండటం పై విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి నాగచైతన్య ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్నాడు. పైగా చైతుకి భారీ మార్కెట్ కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో చైతు కస్టడీ సినిమా కోసం ఎందుకు ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారు ? అంటూ టాక్ నడుస్తోంది.
వాస్తవానికి ఫామ్‌లోకి వచ్చాడులే అనుకునే టైమ్‌కు నాగ చైతన్య థాంక్యూ సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు. బేసిక్ కలెక్షన్స్ ను కూడా ఆ చిత్రం రాబట్టలేక పోయింది. ఐతే, ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మంచి దర్శకుడే కాదు వెర్సటైల్ రైటర్ కూడా. యూత్ ఫుల్ కంటెంట్ కు కాంటెంపరరీ స్టఫ్ తో పాటు ఎమోషనల్ సోషల్ కాజ్ ను కూడా అద్దగలడు వెంకట్ ప్రభు. అందుకే ఇప్పుడు వెంకట్ ప్రభు – చైతు కలయికలో వస్తోన్న కస్టడీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించింది.
ఇవి కూడా చదవండి…