మార్చి 3న మనోజ్ పెళ్లి ఖరారు

19
- Advertisement -

మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మార్చి 3న పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డితో జరిగే వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక మంచు ఫ్యామిలీలో ఫాలోయింగ్ ఉన్న హీరో మనోజ్. హీరోగా గ్యాప్ వచ్చినా.. మనోజ్ కి ఇప్పటికీ క్రేజ్ ఉంది. మంచి నటుడు, పైగా మంచి మనిషి అని ఇండస్ట్రీలో మనోజ్ కి గుడ్ నేమ్ ఉంది.

అయితే, గత కొంత కాలంగా మనోజ్ రెండో పెళ్లి పై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎప్పుడైతే.. ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి మనోజ్ కనిపించాడో.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున వీరి బంధం పై అనేక కథనాలు వచ్చాయి. మనోజ్ – మౌనిక పెళ్లి పై కూడా అనేక డిస్కషన్స్ షురూ అయ్యాయి. మధ్యలో మనోజ్ కూడా తమ బంధం పై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మనోజ్ పెళ్లి పై మళ్లీ క్లారిటీ వచ్చింది. ఎలాగూ పర్సనల్ లైఫ్ లో మనోజ్ త్వరలో సెటిల్ కాబోతున్నాడు.

ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. మనోజ్ కి కాలం కరుణించలేదు. అన్నీ ఉన్నా.. స్టార్ కాలేకపోయాడు. నిజానికి మంచు మనోజ్ కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఓ దశలో రెండు మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఐతే, ఆ తర్వాత వరుస ప్లాప్ లు, దీనికితోడు కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే, పెళ్లి తర్వాత మనోజ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నాడు.

ఇవి కూడా చదవండి…

ఆర్ఆర్ఆర్‌కు మరోసారి అవార్డుల పంట…

మహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు

- Advertisement -