పవన్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

19
- Advertisement -

హీరో పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో పాటు మరో 3 చిత్రాలను లైన్ లో పెట్టారు. ఇటీవలే ‘వినోదయ సీతం’ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ మూవీకి గానూ పవన్ కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో తెలుసా ?.. పవర్ స్ఠార్ ఈ సినిమా షూటింగ్ కోసం 20 రోజులకు గాను రూ. 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. చిత్ర యూనిట్ కూడా దీనికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ ‘వినోదయ సీతం’ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వారు నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క షూట్ ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరలో దీనిని ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఐతే, పవన్ కళ్యాణ్ వరుసగా ఈ సినిమాకి డేట్స్ ఇస్తా అని మొదట కమిట్ అయ్యాడు. ఇప్పుడు మూడు షెడ్యూల్స్ లో డేట్స్ ఇస్తా అంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ కూడా అనుకున్న దాని కంటే.. రెండు నెలలు ఆలస్యంగా స్టార్ట్ కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!

పాన్ ఇండియా ‘క్రాంతి’ ఎలా ఉందంటే?

చిన్న సినిమా మీదే పెద్ద ఆశలు

- Advertisement -