జాతీయ పార్టీగ్తా ఉన్న బీజేపీకి నార్త్ లో ఉన్న బలం సౌత్ లో లేదనే విషయం అదరికి తెలిసిందే. దాంతో ఎన్నో ఏళ్లుగా సౌత్ లో బలం పెంచుకోవాలని చూస్తున్న కాషాయపార్టీకి ఎప్పటికప్పుడు ఎదురుదేబ్బే తగులుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళ్ నాడు, కేరళ ఇలా ఏ రాష్ట్రంలోనూ బీజేపీ లేదు. అంతో ఇంతో కర్నాటకలో కాస్త బలమైన పార్టీగా రెండు మూడు సార్లు అధికారం చేపట్టింది. అది కూడా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టింది. దీంతో స్వతహాగా బీజేపీకి అక్కడ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.
అయితే ఈ సారి ఎన్నికల్లో సౌత్ రాష్ట్రాలలో కూడా బలమైన మెజారిటీ సాధించాలని చూస్తోంది కాషాయ పార్టీ.. అయితే సౌత్ ప్రజలు కాషాయ పార్టీని నమ్మే ఛాన్స్ ఉందా అంటే ప్రశ్నార్థకమే. బలంగా ఉన్న కర్నాటకలో కూడా బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఇక ఏపీ, కేరళ, తమిళ్ నాడు వంటి రాష్ట్రాలలో బీజేపీ డిపాజిట్ దక్కించుకునే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఏపీలో ప్రధానం పోటీ అంతా టీడీపీ, వైసీపీ, జనసేన మద్యనే నెలకొంది. జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్నప్పటికి.. బీజేపీకి ఒరిగెదేమి లేదు. ఇక తమిళ్ నాడులో అన్నాడీఎంకే, డీఎంకే వంటి పార్టీలు ప్రభావమే అధికంగా ఉంటుంది. అన్నాడీఎంకే తో పొత్తులో ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ ఎన్నికల సమయానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. ఇక కేరళ విషయానికొస్తే వెఫ్ట్ పార్టీల దెబ్బకు బీజేపీ ఎదిగే ఛాన్స్ చాలా తక్కువ.
ఇక అంతో ఇంతో తెలంగాణలో గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని కమలనాథులు జబ్బలు చారుస్తున్నప్పటికి.. వాస్తవ పరిస్థితులు అలా లేవనే విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితం అయిన కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఇక తెలంగాణలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో గెలిచినప్పటికి అది పార్టీ బలం కానే కాదు. ఎందుకంటే దుబ్బాక లో రఘునందన్ రావు, హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ వారి స్వబలంతో గెలిచారే గాని పార్టీ అండతో కాదు.. నిజంగా తెలంగాణలో బీజేపీ బలపడి ఉంటే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలి కానీ అలా జరగలేదు. మునుగోడులో బలమైన అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని రేస్ లో నిలబెట్టినప్పటికి ఓటమి తప్పలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో కూడా బీజేపీ బలం శూన్యం అని చెప్పక తప్పదు. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో సౌత్ రాష్ట్రాలలో బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకపోతే దక్షిణాది రాష్ట్రాలలో కాషాయ పార్టీ గల్లంతు కావడం ఖాయం అనేది వాదన. మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…