అప్పుల ఊబిలో మీరా.. అందుకే ఇలా?

61
- Advertisement -

సినిమా హీరోయిన్ అనగానే కోట్ల సంపాదన అనుకుంటారు. సినిమా వాళ్ల మీద ఎప్పుడూ అభిమానుల అభిమానంతో పాటు ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటాయి. మాజీ హీరోయిన్ మీరా జాస్మిన్ పరిస్థితే ఇందుకు చక్కటి ఉదాహరణ. ‘గుడుంబా శంకర్‌’, ‘భద్ర’, ‘గోరింటాకు’ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ల సరసన చేరిన నటి మీరా జాస్మిన్‌.. తన పెళ్లి అయ్యాక సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది.

అయితే, మీరా జాస్మిన్ ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటుంది. పైగా ఆమె చుట్టూ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మొత్తంగా చూసుకుంటే.. మీరా జాస్మిన్ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఇంతకీ, మీరా జాస్మిన్ కి సుమారు పదిహేను కోట్లకు పైగా అప్పులు వున్నాయట. ఆ అప్పులకు కారణం ఆమె భర్త చేసిన సైడ్ బిజినెస్ అని తెలుస్తోంది. అయితే, సినిమా వాళ్ళ అప్పులకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ మీరా జాస్మిన్ కి కూడా వడ్డీలు పెరిగి పెరిగి ఏడాదికి కోటి రూపాయల వరకు వడ్డీనే కడుతుందట.

అందుకే, భర్తకు కూడా దూరం జరిగి.. తన పేరు మీద ఉన్న అప్పులు తీర్చుకునే పనిలో పడింది మీరా జాస్మిన్. ఈ క్రమంలోనే మళ్లీ మొహానికి రంగు వేసుకోవడానికి ఉబలాట పడుతుంది. ఐతే దాదాపు పదేళ్ల తర్వాత మీరా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చివరగా తెలుగులో మీరా జాస్మిన్‌ ‘మోక్ష’ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఇంతకీ మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -