ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సార్. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. ఐతే, ఈ వేడుక కు త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కమెడియన్ హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇంతకీ హైపర్ ఆది ఏం మాట్లాడాడు అంటే.. “మాటలకి మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట ‘థ్యాంక్యూ త్రివిక్రమ్ గారు. ప్రాసకి ఆశ కలిగితే అది చూడాలనుకునే మొదటి ఫేసు త్రివిక్రమ్ గారిదే. ఒక వైట్ పేపర్‌కు కరెక్టుగా న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ గారు. ఆయనది భీమవరం..ఆయన మన ఇండస్ట్రీకి లభించిన వరం” అంటూ త్రివిక్రమ్ ను హైపర్ ఆది ఆకాశానికి ఎత్తేశాడు.
‘సార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గురించి హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. హైపర్ ఆది స్పీచ్ కి ఓ దశలో త్రివిక్రమ్ సైతం తెగ సంతోషపడి పోయాడు. ఇక హైపర్ ఆది తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి కూడా త్రివిక్రమ్ కి చిన్నపాటి భజన చేశాడు. ‘త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు’ అని వెంకీ అట్లూరి కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి..