ఉదయాన్నే ఇవి తింటే.. డేంజర్!

60
- Advertisement -

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే పడగడుపున కంటికి కనిపించే ఆహారం ఏదైనా వెంటనే తినేయడం ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా ఉదయం పూట పడగడుపున ఏది పడితే అది తినడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట ఆయిల్ ఫుడ్ ను అసలు తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్ ఉదయాన్నే తినడం వల్ల కడుపులో త్వరగా గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఛాతీలో మంట, అల్సర్ వంటి ఉదర సంబంధిత సమస్యలు కూడా చుట్టూ ముట్టె అవకాశం ఉంది. ఇక చాలమందికి ఉదయం పూట స్వీట్స్ తినే అలవాటు కూడా ఉంటుంది. .

ఇలా ఉదయాన్నే స్వీట్స్ తినడం వల్ల కొవ్వు శాతం అధికంగా పెరుగుతుంది. ఇక మజ్జిగ కూడా ఉదయాన్నే అసలు తాగకూడదట.. ఎందుకంటే మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అందువల్ల పడగడుపున మజ్జిగ తాగడం వల్ల అందులో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎసిడిటీకి కారణం అవుతుంది. ఇక పొద్దున్నే కూల్ డ్రింక్స్ లేదా చల్లటి పానీయాలు తాగడం కూడా మంచిది కాదు. వీటి వల్ల ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా అన్నవాహికకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక విటమిన్ సి అధికంగా ఉండే సిట్రిక్ పండ్లు, నారింజ పండ్లు, వంటి వాటిని కూడా తినకూడట.

ఎందుకంటే ఖాళీ కడుపున విటమిన్ సి ఉన్నవాటిని తీసుకుంటే ఎసిడిటీ, అల్సర్ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మాక్సిమమ్ వీటన్నిటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో దోసె, పూరీ, బోండా, వడ వంటి ఆయిల్ ఫుడ్స్ కన్నా ఇడ్లీ, బ్రెడ్ శాండ్విచ్ వంటి ఆహారాన్ని తీసుకుంటే మచిదని నిపుణుల సూచన. ఇడ్లీ చాలా తేలికగా జీర్ణం అవుతుంది. అంతే కౌండా ఇందులో కొలెస్ట్రాల్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఇక బ్రెడ్ శాండ్విచ్ లో ఫైబర్, విటమిన్ బి1,బి6,బి12, కాల్షియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి బ్రెడ్ శాండ్విచ్ ఎంతో మంచి బ్రేక్ ఫాస్ట్. ఇక మొలకెత్తిన విత్తనాలు, ఉడకబెట్టిన గుడ్డు వంటివి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే మరి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:అక్కడ ఉప ఎన్నిక.. గెట్ రెడీ?

- Advertisement -