- Advertisement -
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్ ముదిరాజ్‌ను రాష్ట్ర మంత్రులు అభినందించారు. శనివారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నామినేషన్ వేసిన బండా ఆదివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే మండలిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బండా ప్రకాశ్‌ను కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… సంక్షేమం అభివృద్దిలో బీసీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. బీసీలంటే సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు. బీసీలకు రాజకీయ పదవులలోనూ వారికే అగ్రతాంబూలం ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…
ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్..
21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతి..
14న కొండగట్టుకు కేసీఆర్..
- Advertisement -