కలకత్తాలో చిరు!

17
- Advertisement -

తెలుగు సినిమాలో కలకత్తా నేపథ్యం అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలని ఉంది’. ఆ సినిమాలో చిరు రివేంజ్ తీర్చుకునేందుకు కలకత్తా లో అడుగుపెట్టి అక్కడే ఉంటాడు. సినిమా కోసం అప్పట్లో హైదరాబాద్ లోనే భారీ ఖర్చుతో కొల్కత్తా సెట్ వేశారు. ఆ సెట్ చూసేందుకు దర్శక నిర్మాతలు , హీరోలు చిరు షూటింగ్ కి వెళ్ళేవారు కూడా.

ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. చిరంజీవి సినిమా కోసం మళ్ళీ కలకత్తా సెట్ వేశారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి కలకత్తా నేపథ్యంతో వచ్చే సన్నివేశాలు తీస్తున్నారు. ప్రస్తుతం సెట్ లో చిరు ఇంట్రో సాంగ్ తీస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా సాంగ్ ఘాట్ లో పాల్గొంటుంది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరు ను కలకత్తా సెట్ లోకి వెళ్ళి పలకరించారు. సెట్ బాగుందని సాంగ్ నచ్చిందని టీం కి చెప్పి విశ్ చేశారు.

సొ చూడాలని ఉంది తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో చిరు సినిమా కోసం కలకత్తా సెట్ వేయడం , ప్రముఖులు చూసేందుకు వెళ్ళడం ఫ్యాన్స్ కి అప్పటి మెమొరీస్ ను గుర్తుచేస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -