ఈ హీరోయిన్‌కి సిగ్గుపడడం రాదట..

231
rithika-singh-never-shies
- Advertisement -

హీరోయిన్ అవ్వాలని చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ రితికా సింగ్ పరిస్థితి వేరు. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన రితికా, సినిమా కథకు సూటవుతుందనే ఉద్దేశంతో ‘సాలా ఖద్దూస్’లో యాక్ట్ చేసింది. అందులోనూ ఆమె నటించింది బాక్సర్‌గానే కావడంతో, ఆమె గ్లామర్‌పై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. తెలుగులో ‘సాలా ఖద్దూస్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘గురు’తో ఎంట్రీ ఇచ్చిన రితికా అందచందాలపై మనవాళ్లు కూడా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. అయితే ‘శివలింగ’ లో రితికా పెర్ఫార్మెన్స్ చూసిన సినీ జనాలు ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం అని తేల్చేసారు.

guru

లారెన్స్‌తో పోటీ పడి మరీ డాన్సులు చేసింది. ఈ సినిమాతో మరోసారి మాస్ ఆడియన్స్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే రితికా సింగ్ మాత్రం నటించడం కంటే బాక్సింగ్ చేయడమే ఈజీ అంటోంది. లారెన్స్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టమైంది. కాలు నొప్పిగా ఉన్నాసరే డ్యాన్స్ చేశాను. బాగా డ్యాన్స్ చేశాననే అనుకుంటున్నాను. రోజూ చీర కట్టుకోవడం మాత్రం బాగా ఇబ్బందిగా అనిపించింది. నాకు గ్లామర్ అంటే మీనింగ్ తెలియదు. ఓ పాటలో మాత్రం గ్లామర్ గా కనిపించాను. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేస్తాను. నాకు నటన కంటే మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ అంటేనే ఇష్టం. నటించడం చాలా కష్టం. నాకు కిక్ బాక్సింగ్ వచ్చు కదా అని రియల్ లైఫ్ లో ఎవరిని పడితే వాళ్లను కొట్టను. డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ సినిమా చేస్తున్నానని అన్నారు.

shivalinga

తనకి నటన అంతగా రాదని..కనీసం సిగ్గుపడడం కూడా రాదని చెప్పింది. అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇవ్వడంతో టాలీవుడ్ కన్ను ఈ బాక్సింగ్ బ్యూటీ మీద పడిందనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -