మెట్రోలో ఆర్టీసీతో సమానంగా ఛార్జీలు వసూలు చేస్తారని ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోబోమని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్‌ఎన్‌డీపీ, మెట్రో రైలు, చార్మినార్ పాదబాట అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… వడ్డించే వాళ్లు మనవాళ్లయితే బాగుండు అని కేంద్రంపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. కేంద్రంకు హైదరాబాద్‌పై ప్రేమ లేదని మండిపడ్డారు. కోటి 20లక్షల మంది నివసిస్తున్న నగరంకు మెట్రో కోసం కేంద్రం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. మెట్రోలో అత్యధికంగా రష్‌గా ఉండేది అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ అని అన్నారు. ఇందులో సూమారుగా 80శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పనిచేస్తున్నారని అన్నారు. ఇటీవలే శంకుస్థాపన చేసిన శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో స్టేషన్‌ను మూడేండ్లలో పూర్తి చేస్తామన్నారు. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు.
హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మదీనా నుంచి పత్తర్‌గట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయన్నారు. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని తెలిపారు. చార్మినార్ నుంచి దార్-ఉల్-ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. గుల్జార్‌హౌస్, మీర్-ఆలం-మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు పూర్వవైభవం కోసం కృషి చేస్తామని అన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చైన వెనుకాడబోమని వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధి కోసం రూ.985.45కోట్లు వెచ్చించామన్నారు. నాలాల అభివృద్ధిలో భాగంగా 35 పనులకు గాను 11 పూర్తిచేశామన్నారు. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశామన్నారు. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయని…వాటిని అధునికరించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దాదాపుగా నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారని అన్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం దేశంలో ఏ నగరంలో లేదన్నారు. దీని కింద ఫేజ్ -1,2 ప్రణాళికలు రూపొందించామని త్వరలో వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో కొన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి..
సొంత స్టిక్కర్లు ఉంటే నిధులు కట్…
ఎలక్షన్ కోడ్..సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా
మండలి వైస్‌ఛైర్మన్‌గా బండా నామినేషన్..