ప్రపంచంలో అత్యధిక జనామోదం కలిగిన నాయకుల్లో భారత ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. పోలిటికల్ ఇంటిలిజెన్స్ అయిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో భాగంగా ఈ మదింపు జరిగింది. ఇది జనవరి 26 నుంచి 31 వరకూ సేకరించిన డేటా ద్వారా నిర్ణయించారు. అయితే గత 2020 మార్చి నుంచి జనవరి 2023 జనవరికి జరిగిన వివిధ మార్పులను అంచనావేసినట్టు గ్రాఫ్ ద్వారా వెల్లడించారు. 22దేశాలకు చెందిన నాయకులను డేటాను రూపొందించింది. అత్యధికంగా దాదాపుగా 78శాతం ప్రజల నుంచి అప్రూవల్ పొందిన నాయకుడిగా నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ 7వ స్థానంలో ఉన్నారు. యూకే ప్రధాని రిషి సునాక్ 12వ స్థానంలో ఉన్నారు. కాగా రెండవ స్థానంలో మెక్సిక్ దేశాన్నికి చెందిన లోపెజ్ ఉన్నారు. మూడవ స్థానంలో (బెర్సెట్) స్విట్జర్లాండ్, నాలగవ స్థానంలో (ఆల్బనేసే) ఆస్ట్రేలియా, ఐదవ స్థానంలో (లూలా డా సిల్వా) బ్రెజిల్ ఉన్నారు. ఆరవ స్థానంలో ఇటలీ (మెలేనీ) ఉన్నారు. అత్యంత ప్రజామోదం పొందడంలో మోదీ ముందుడుగు వేయడంలో తాను తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని అన్నారు. అయితే దేశంలో అస్థిరిత లాంటి ఇతర కారణాలు ఏ మాత్రం ప్రభావితం చేయలేదని రిపోర్ట్ నిదర్శనమని అన్నారు.
ఇవి కూడా చదవండి…
ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ
సీఎం కేసీఆర్‌పై తమిళి సై ప్రశంసలు..
ప్రపంచంలోనే టాప్ 1..తిరుమల మ్యూజియం