నాగలి కాదు రాజ్యాంగాన్ని నడిపించాలి…

61
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా ఒడిశాకు చెందిన మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ మరియు ఇతర నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరిలో 12 మాజీ ఎమ్మెల్యేలు నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్‌లో చేరారు. వారిలో హేమ గమాంగ్ జయరాం పాంగీ రామచంద్ర హన్ష్‌డా బృందావన్ మజ్హీ నబీన్ నంద రాథా దాస్ భగీరథి సేతి మయదార్ జేనా తదితరులు ఉన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఒక మహాన్ భారత్ నిర్మిద్దమన్నారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దేశ భవిష్యత్‌ కోసమే బీఆర్ఎస్‌ ఆవిర్భించిందని వివరించారు. ఈ మహా సంగ్రామంలో కలిసి వస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రజలకు స్వాగతం తెలిపారు. నవ నిర్మాణ్‌ కృషక్ సంఘటన్‌ కన్వీనర్ అక్షయ్‌ కుమార్‌ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన వారందరికి స్వాగతమన్నారు. దేశంలోని క్రియాశీల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గమాంగ్‌ ఒకరని…రైతుల కోసం గమాంగ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. గమాంగ్ చేరిక నాకు వెయ్యి ఎనుగుల బలమన్నారు.

అభివృద్ధిలో మన కంటే అమెరికా చైనా చాలా ముందంజలో ఉన్నాయని అన్నారు. కానీ మన కంటే వాళ్లకు తక్కువ వనరులు ఉన్న…వాళ్లు అభివృద్ధి సాధించారని అన్నారు. ఈ సందర్భంగా భారత్‌ ఎందుకు అభివృద్ధి చేందడం లేదని ప్రశ్నించారు. దేశ యువత అమెరికా వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. గ్రీన్ కార్డు వస్తే సంబురాలు చేసుకుంటున్నారు. దేశంలో గుణాత్మ‌క మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అన్నారు. దేశంలో స‌రిప‌డా నీళ్లున్నా పొలాల‌కు మ‌ళ్ల‌వు, స‌రిప‌డా క‌రెంట్ ఉన్న చీక‌ట్లు తొల‌గ‌వు. ప్ర‌భుత్వాలు మారినా రైతులు, కార్మికుల ప‌రిస్థితి మార‌లేదన్నారు.

ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే నాయ‌కుల‌కు ల‌క్ష్యంగా మారిందని కేసీఆర్ విమర్శించారు. ఏదో ర‌కంగా ఓట్లు సంపాదించుకోవ‌డ‌మే రివాజుగా మారిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న‌ప్ప‌టికీ తాగ‌డానికి నీళ్లు దొరకట్లేదు. రైతులు దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో 13 నెల‌ల ఉద్య‌మం ఎందుకు చేశారు. ఇప్ప‌టికీ రైతుల‌కు ఒక భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్న‌ది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను గెలిపించండి.. దేశంలో నీళ్లు, క‌రెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఏదైనా సాధ్య‌మేనన్నారు. తెలంగాణ‌ అందుకు సాక్ష్యమన్నారు. తెలంగాణ‌లో సాధ్య‌మైంది మరీ దేశ‌మంత‌టా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం మరీ దేశమంతా ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతు రావాలి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో 4లక్షల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ఉంది అయినా ఎందుకు కరెంటు కష్టాలు ఇవన్నీ పోవాలంటే బీఆర్‌ఎస్ పార్టీ రావాలి అని అన్నారు. పేదోడి కడుపు కొట్టి ఉన్నోడి జేబు నింపుతున్న ప్రభుత్వాలు పోవాలి దేశంలో నడిచిదే రైతుల ప్రభుత్వం రావాలి…చట్టసభలో అడుగు పెట్టాలని అన్నారు. రైతులు నాగలి పట్టడమే కాదు…రాజ్యాంగాన్ని నడిపే నాయకులుగా మారాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి…

లోకేశ్ పాదయాత్ర.. ఎవరికి దడ ?

29న బీఆర్ఎస్‌పీపీ సమావేశం..

మీలో ఎవరు సి‌ఎం అభ్యర్థి?

- Advertisement -