అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవయిటింగ్ పుష్ప 2 కి సంబందించి వరుస లీకులు బయటికొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుండే చిన్న చిన్న లీకులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వైజాగ్ లో ‘పుష్ప ది రూల్’ ఘాట్ జరుగుతుంది. వైజాగ్ ఎపిసోడ్ ఘాట్ కి సంబంధించి ఇప్పటికే బన్నీ చైర్ లో కూర్చొని రాసుకుంటున్న ఫోటో అలాగే మరికొన్ని వీడియోలు లీక్ అయ్యాయి.
ఇక ‘పుష్ప 2’ నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ లీక్ వీడియోలతో సంబర పడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కి సంబంధించి కూడా ఇలాగే చాలా లీకులు వచ్చాయి. ఏకంగా ఫైట్ ఎపిసోడ్ , సాంగ్ విజువల్స్ కూడా లీక్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కూడా పుష్ప 2 కి ఇలా లీకుల బెడద తాకింది.
మైత్రి మూవీ మేకర్స్ లీకుల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోరని ఇప్పటికే ఓ మచ్చ ఉంది. తాజాగా పుష్ప 2 లీకులతో మళ్ళీ వారికి లీకుల ఎఫెక్ట్ తగులుతుంది. మరి ఇప్పటికైనా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కాస్త కేర్ తీసుకొని ఘాట్ లో ఎలాంటి లీకులు జరగకుండా ఓ స్పెషల్ టీం పెట్టుకుంటే బెటరేమో.
ఇవి కూడా చదవండి…