- Advertisement -
భారత టెన్నిస్ స్టారక సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్నతో కలిసి ఆడిన సానియా జోడి ఫైనల్స్‌లో ఓటమి పాలైంది.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. విజయం సాధించిన బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ,రఫెల్ మాటోస్ జంటను సానియా మీర్జా అభినందించారు. నా వృత్తిపరమైన కెరీర్ మెల్బోర్న్‌లో ప్రారంభమైంది.నా కొడుకు ముందు నేను గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఆడగలనని ఎప్పుడూ అనుకోలేదు అని ఎమోషనల్ అయింది సానియా. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో సానియా తన చివరి టోర్నమెంట్‌ను ఆడనున్నారు.
సానియా కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -